త్వరలో బాహుబలి ప్రీక్వెల్… కానీ

తెలుగు చలన చిత్ర పరిశ్రమ జెండాను ప్రపంచ వ్యాప్తంగా ఎగరవేసిన సినిమా బాహుబలి. ఇండియన్ సినీ చరిత్రలో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన బాహుబలి సినిమా రెండు భాగాలుగా రిలీజై.. ప్రేక్షకులను ఆకట్టుకున్నది. జక్కన్న చెక్కిన బహుబలి… సిరీస్ మరొక రిలీజ్ కానున్నది.. అయితే ఇది వెండి తెరపై కాదు… వెబ్ సిరీస్ గా రిలీజ్ కావడానికి రంగం సిద్ధం అవుతుంది.
ఈ సిరీస్ లో బాహుబలి ప్రీక్వేల్ ఉంటుంది.. రాజమాత శివగామి జీవితం… మాహిష్మతి రాజ్యం ను ఆవిష్కరించనున్నారు.

ప్రముఖ రైటర్ ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘రైజ్ అఫ్ శివగామి’ బుక్ ఆధారంగా ఈ ఫ్రీక్వెల్ తెరకెక్కుతుంది. బాహుబలిని నిర్మించిన రాజమౌళి నిర్మాతలుగా వ్యవహరించిన ఆర్కామీడియా కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. ఈ సిరీస్ కు దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. మొదటి సీజన్ లో తొమ్మిది ఎపిసోడ్ లు ఉంటాయి. ఇందులో శివగామి చిన్నప్పటి జీవితం ఆమె ధైర్యసాహసాలు వంటి ఘటనలు ఉంటాయి.

కాగా ఈ ఫ్రీక్వెల్ కు సంబంధించి బాహుబలి దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. నెట్ ఫ్లిక్స్ నిర్ణయం భారతీయ ప్రాచీన కథను ప్రపంచానికి చాటిచెబుతోందని. ఈ విషయంలో చాలా సంతోషంగా ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రసాద్ దేవినేని, మాట్లాడుతూ.. ఈ ఫ్రీక్వెల్ ఒరిజినల్ సిరీస్ డెవలప్ చెయ్యడానికి ఏడాదికి పైగా నెట్ ఫ్లిక్స్ తో పనిచేస్తున్నట్టు అయన తెలిపారు. ఇదిలావుంటే సాకార్డ్ గేమ్స్ తరువాత ‘నెట్ ఫ్లిక్స్’ బాహుబలి ఫ్రీక్వెల్ నే నిర్మించడం విశేషం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here