National

ప్రైవేట్ బిల్లు పెట్టనున్న అవంతి శ్రీనివాస్

శుక్రవారంనాడు లోకసభలో టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వం కాపులకు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఆంధ్రప్రదేశ్ లో కాపులకు ఉద్యోగాలు, సర్వీసుల్లో రిజర్వేషన్ బిల్లు2018 ను ఉదహరిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన రిజర్వేషన్ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపాలని కోరారు.

Comment here