శ్రీవారి మహా సంప్రోక్షణకు నేడు అంకురార్పణ

తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాసంప్రోక్షణకు సర్వం సిద్ధం అయ్యింది. ఈ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు నేడు (శనివారం) అంకురార్పణ జరగనుంది. ఆదివారం ఉదయం ఆగమోక్తంగా మొలు కానున్న ఈ మహా క్రతువు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఈ క్రతువు ఈనెల 12 నుంచి 16 వరకు కొనసాగుతుంది. అంకురార్పణ సందర్భంగా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విశ్వక్సేనుల ఊరేగింపు ఉంటుంది.
12 ఆదివారం నాడు కుండలాల శుద్ధి పుణ్యావచనం… మూల విరాట్టు శక్తిని కుంభంలోకి ఆవాహనం ఉంటుంది.
13న అష్టబంధన వస్తువులకు, ద్రవ్యపదార్థాలకు శుద్ధి పుణ్యాహవచనం… 14న గర్భాలయంలో మరమ్మతులు… ప్రత్యేక హోమాలు, పూర్ణాహుతి కత్రువు జరుగుతుంది.
15న మూలవర్లకు మహాశాంతి తిరుమంజనం.. 16న పూర్ణాహుతితో పాటు గర్భాలయానికి, ఉప ఆలయాలకు కుంభాల తరలింపు బ్రహ్మగోష పఠనంతో మహా సంప్రోక్షణ ముగింపవుతుంది.
17వ తేదీ నుంచి యథావిధిగా శ్రీవారి దర్శనభాగ్యం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here