జీఎస్టీ భారం తగ్గించాలని అరుణ్ జైట్లీ కి ఏపీ మంత్రి యనమల లేఖ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారులు, వర్తక వాణిజ్యాలకు జీఎస్టీ భారం తగ్గించాలని కోరుతూ జీఎస్టీ కౌన్సిల్ చైర్మన్ అరుణ్ జైట్లీకి ఏపీ ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. చింతపండు, చేనేత వస్త్రాలు, చిలపనూలు, యూహెచ్ టీ పాలపై పన్ను ఎత్తివేయాలని కోరారు. కొండపల్లి, ఏటికొప్పాక, కాళహస్తి వస్త్ర పాయింటింగ్లపై జీఎస్టీ ఎత్తివేయాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే వికలాంగుల పరికరాలు, మత్య్సకారుల వలలకు పన్ను మినహాయించాలని మంత్రి యనమల కోరారు. నాపరాళ్లపై పన్ను 5శాతం నుండి 12 శాతానికి పెంచే ప్రతిపాదనను విరమించాలన్నారు. ట్రాక్టర్లు, ట్రాక్టర్ల టైర్లు, సినిమా టిక్కెట్లు, బిస్కెట్లు, చిన్న, మధ్యతరహా పరిశ్రమల యంత్రాలపై పన్ను తగ్గించాలని కోరారు. అలాగే గిరిజన కార్పొరేషన్, టీటీడీని జీఎస్టీ పరిధి నుండి తొలగించాలని మంత్రి యనమల రామకృష్ణుడు లేఖలో కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here