Education and Employment

రూ. 43, 180 లు కనీస వేతనం కావాలంటున్న ఉపాధ్యాయులు

ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయుల కనీస వేతనం రూ. 43, 180 లుగా ఉండేలా సిఫార్సు చేయాలనీ కోరుతూ ప్రోగేసివ్ రికగ్నైజ్ద్ టీచర్స్ యూనియన్ బృందం పిఆర్సి చైర్మన్ అశుతోష్ మిశ్రాను కలిసి ఓ వినతి పత్రం అందించారు. అంతేకాదు ఉద్యోగుల కనీస వేతనం రూ. 25వేలు.. గరిష్ఠ వేతనం రూ. 2 లక్షల, 26వేల 690లుగా ఉండాలని కోరారు. కరవుభత్యం విలీనమయ్యే 80 అంచెలతో మాస్టర్ స్కేల్ ఉండాలన్నారు. మూల వేతనంలో మూడు శాతం పెంపుదలతో వార్షిక ఇంక్రిమెంట్లు, కేంద్ర ప్రభుత్వంతో సమానంగా కరవుభత్యం ఇవ్వాలన్నారు. రాజధానితోపాటు నగరాల్లో పని చేసే వారికి 30 శాతం, జిల్లా కేంద్రాల్లో 25 శాతం, మున్సిపాల్టీల్లో 20 శాతం, గ్రామాల్లో 18 శాతం ఇంటి అద్దె ఇవ్వాలన్నారు. సర్వీస్‌లో మూడు సార్లు దేశంలో ఎక్కడికైనా, ఒక్కసారి విదేశాలకు వెళ్ళేందుకు ఎల్‌టీసీతోపాటు ఒక నెల మూల వేతనాన్ని ఖర్చుల కింద ఇవ్వాలని కోరారు. మరి ఉపాద్యాయుల వినితి పై ప్రభుత్వం స్పందిచాల్సి ఉంది.

Comment here