Local news

ఏపీలో నిరుద్యోగ భృతి పొందితే… ఉద్యోగం ఖాయం… ఎలా అంటే…!

ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార తెలుగుదేశం పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వడివడిగా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఏపీలో ఉన్న నిరుద్యోగ యువత భవిష్యత్ కు భరోసా ఇచ్చేలా కొత్తగా ప్రకటించిన పథకం “ముఖ్యమంత్రి యువనేస్తం”. ఈ పథంలో యువతకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున నిరుద్యోగ భ్రుతి ఇవ్వనున్నారు. విభజనతో ఆంధ్ర రాష్ట్రము హైద్రాబాద్ కోల్పోయింది. దీంతో అక్కడే ఐటీ, పరిశ్రమలు, కేంద్ర సంస్థలు ఉండిపోయాయి. ఏపి ఉద్యోగ వనరులు కల్పించే పరిశ్రమలు లేకుండా ఏర్పడింది. అనంతరం ఈ నాలుగేళ్లలో ఏపిలో 721 కంపెనీలు 1.49లక్షల కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు అయ్యాయి. అంతేకాదు స్మాల్ మీడియం ఇండస్ట్రియల్ రంగంలో 2లక్షల 27వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి. మొత్తంగా ఈ నాలుగేళ్ళలో ళ్ళలో రాష్ట్రం లో మొత్తం.5.57లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినా ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కి విధి విధానాలు ఖరారు. నెలకు వెయ్యి ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపు కోవడం లేదు.
పథకం కోసం ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనే తనకు ఇష్టమైన రంగాన్ని నిరుద్యోగ భృతి ఆశిస్తున్న యువతీ, యువకుడు పేర్కొనాలి. స్వయం ఉపాధి, పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్‌, ఏపీ స్కిల్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌, వివిధ బీసీ సమాఖ్యలు… ఇలా పలు విభాగాలు ఇప్పటికే అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి. అర్హులైన వారి వివరాలు, వారు ఎంచుకున్న శిక్షణ రంగాలను జిల్లాల వారీగా… డీఆర్‌డీఏ పీడీలకు పంపిస్తారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో నెల రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేస్తారు. శిక్షణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.12వేలు ఖర్చు చేయనున్నారు. దీన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్రంలో రాబోయే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ భృతి తీసుకుంటున్న యువతను తీర్చిదిద్దుతారు. పరిశ్రమల అవసరాలు తెలుసుకుని… వారి ఉద్యోగావసరాలకు తగిన శిక్షణ ఇస్తారు. అదేసమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్ గా కూడా వీరిని ఎంపిక చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. నిరుద్యోగ భృతి కోసం ఏర్పాటుచేసే ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లోనే… భవిష్యత్తు ఉద్యోగావకాశాల సమాచారం కూడా అందిస్తారు. అదేవిధంగా వెబ్‌పోర్టల్‌లో నమోదైన యువత వివరాలను కంపెనీలకూ అందిస్తారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలకు తగినవారుంటే ఎంపిక చేసుకునేలా సమన్వ యం చేస్తారు. మొత్తం నిరుద్యోగ భృతి కింద నమోదైన వారందరికీ శిక్షణ ఇస్తారు.
ముఖ్యమంత్రి యువనేస్తం గా ఆగస్ట్ 2, 3 వారాలలో రిజిస్ట్రేషన్ ప్రారంభం
kyc ఖచ్చితంగా ఉండాలి.
పెన్షన్ నిబంధనలు వర్తిస్తాయి. ఆగస్ట్ చివరి నుంచి పథకం అమలులోకి వస్తుంది.
ప్రస్తుతం 54 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాము. నిరుద్యోగ భృతి నేరుగా బ్యాంక్ ఖాతాలలో జమ అవుతుంది.
నెలకు వెయ్యి చొప్పున భృతితో పాటు నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇస్తారు.
నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కార్యక్రమాన్ని డిసైన్ చేసి రూపొందించారు
15రోజుల రిజిస్ట్రేషన్ ఉంటుంది. వెంటనే అమలులోకి వస్తుంది.
22-35 మధ్య వయసు ఉండి డిగ్రీ, డిప్లొమా చదివిన వాళ్ళకు పథకం వర్తిస్తుంది. నిరుద్యోగ భ్రుతి తీసుకుని శిక్షణ పొందడం ద్వారా ఎంత మంది యువతకు ఉద్యోగాలిచ్చామో ప్రభుత్వానికి స్పష్టత వస్తుంది. పరిశ్రమకు మ్యాన్ పవర్ సమస్య లేకుండా చూసే అవకాశం దొరుకుంది. అదే విధంగా ఉద్యోగావకాశాలన్నింటిని ఒకే చోటకు తెచ్చినట్లవుతుంది. ఈ పథకానికి మొత్తం తానే కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారు.మంత్రి లోకేష్..

Comment here