Local news

ఏపీలో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరపాలి : హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. స్పెషల్ ఆఫీసర్ల పాలనపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటీషన్ పై మంగళవారం విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 90ను హైకోర్టు కొట్టివేసింది. స్పెషల్ ఆఫీసుర్లుగా ప్రభుత్వం దిగువ కేడర్ ఉద్యోగుల్ని నియమిస్తోందని, వారికి పాలనపై పట్టు ఉండడం లేదని మాజీ సర్పంచులు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఇంకా ఎన్నాళ్లు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగిస్తారని మాజీ సర్పంచులు తమ పిటీషన్లో ప్రశ్నించారు. ఈ తీర్పుపై మాజీ సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Comment here