Education and Employment

జీవో 550పై సుప్రీంకోర్టు కు ఏపీ ప్రభుత్వం

జీవో 550పై ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టు లో పిటీషన్ దాఖలు చేసింది. రిజర్వడ్ అభ్యర్థి ఓపెన్ కోటాలో పొందిన సీటును వదులుకుంటే రిజర్వడ్ అభ్యర్థితోనే భర్తీ చేయాలన్న 550 జీవోను హైకోర్టు కొట్టేసింది.జీవో 550లో పేరా5, క్లాస్2ను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.రితీష్ ఝూ కేసులో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఈ జీవోని ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ పిటీషన్ ఒకటి రెండు రోజుల్లో విచారణకు వచ్చే అవకాశముంది.

Comment here