అజ్ఞాతం వీడిన ధర్మపురి సంజయ్

లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో డిఎస్ తనయుడు ధర్మపురి సంజయ్ వారం రోజుల అజ్ఞాతం వీడి ఆదివారం నిజామాబాద్ ఏసీపీ సుదర్శన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. సంజయ్ పై నిర్భయ చట్టంతో పాటు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదయింది. రెండు రోజుల క్రితం సంజయ్ కోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో పోలీసులు 41/A సెక్షన్ కింద సంజయ్ కు నోటీసులు జారీచేశారు. ఈ నోటీసుల నేపథ్యంలో సంజయ్ అజ్ఞాతం వీడి ఆదివారంనాడు ఏసీపీ సుదర్శన్ ఎదుట హాజరయ్యారు. ధర్మపురి సంజయ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని శాంకరీ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పోలీసులకు పిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధర్మపురి సంజయ్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here