ఏపీలో అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణ : రాయపాటి

ఆంద్రప్రదేశ్ లో అత్యంత అవినీతిపరుడు కన్నా లక్ష్మీనారాయణ అని నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ నుంచి పోటీ చేసినా కన్నా లక్ష్మీనారాయణ గెలవలేరని రాయపాటి సాంబశివరావు విమర్శించారు. తన కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ లో సీజీఎస్టీ విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్పందించిన ఎంపీ రాయపాటి సాంబశివరావు, కక్షసాధింపు చర్యగానే తమ కంపెనీలో తనిఖీలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం నుండి తమ కంపెనీకి బకాయిలు రావాలని చెప్పారు. ఆ బకాయిలు వస్తే కేంద్రానికి జీఎస్టీ కడతామని అన్నారు. తమ కంపెనీ ట్రాన్స్ ట్రాయ్ లో తనిఖీలవల్ల పోలవరం నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పారు. కేంద్రప్రభుత్వం సహకరించకపోయినా చంద్రబాబు మొండి ధైర్యంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నారని చెప్పారు. సిబిఐ, ఈడీ ని అడ్డుపెట్టుకుని వేధింపులకు గురిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రధాని స్థాయి వ్యక్తే బీసీ నంటూ కులప్రస్థావన చేయడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తానని చెప్పారు. చంద్రబాబు అవకాశమిస్తే తన కుమారుడు రంగబాబుని కూడా పోటీకి సిద్ధం చేస్తానన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here