వెంకన్న పాదాల చెంత మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ

ఆంధ్రప్రదేశ్ లో మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ అడుగు పెట్టనున్నది. చిత్తూరు జిల్లా వెంకన్న పాదాల చెంత భారత్ లో తమ తొలి ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి హోలీటెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో ఒప్పందం చేసుకుంది. హోలీటెక్ కంపెనీ వారికి చైనా లో 16 ఫ్యాక్టరీలు ఉండగా… భారత్ లో మాత్రం మొదటి ఫ్యాక్టరీ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసిందే అవుతుంది. ఈ ఫ్యాక్టరీ ని 1400 కోట్ల పెట్టుబడితో నెలకొల్పనున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 6 వేలమందికి పరోక్షంగా మరికొందరికి ఉపాధి లభిస్తుందనిఏపీ ఐటి శాఖా మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఎలక్ట్రానిక్ ఉపకరణాల వ్యాపారం 480 బిలియన్ డాలర్లు ఉందని.. అందులో సగం వాటాను దక్కించుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here