Health

కలబంద రసం, గుజ్జువల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే షాక్..!!

కలబంద పరిచయం అవసరం లేని పేరు… గత కొంత కాలంగా సౌందర్య పోషక పదార్ధం, అద్భుతమైన ఔషధం, ఇది చేసే మేలు అంతా ఇంతా కాదు సర్వరోగ నివారణి అని చెప్పి ఎక్కువుగా వినియోగిస్తున్నారు. కలబంద అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయి.. అని ప్రస్తుతం కలబందను ఎక్కువుగా ఉపయోగిస్తున్నారు… అయితే అతి ఎప్పుడు హానికరమే అన్న సామెతను గుర్తు చేస్తూ… కలబంద వల్ల కొన్ని దుష్ప్రఫలితాలు కూడా ఉన్నాయి..
శతాబ్దాలుగా ప్రజాదరణ పొందిన పదార్ధం కలబంద గుజ్జు . కలబంద నుండి గుజ్జు , రసం మరియు లేటెక్స్ వంటి వాటిని ఉత్పత్తి చేస్తారు. వీటిని మందుల తయారీలో వాడతారు . చాలామంది కలబంద గుజ్జును మధుమేహం, హెపటైటిస్, బరువు తగ్గడానికి, జీర్ణకోశ వ్యాధులు, కడుపులో అల్సర్లు, ఆస్టియో ఆర్థరైటిస్, ఉబ్బసం, జ్వరం, దురద మరియు వాపు, మొదలైనవాటిని నివారిస్తుందని తింటారు..

ఈ గుజ్జును, కలబంద రసం తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇక కలబంద రసాన్ని నోటి ద్వారా తీసుకోవడం వలన అతిసారం, పొత్తికడుపులో నొప్పి, కండరాల బలహీనత, గొంతులో వాపు వంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులు తలెత్తవచ్చు. మరియు తీవ్రమైన కడుపు నొప్పి కలిగి డీహైడ్రేషన్ మరియు ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుంది. కొన్ని సార్లు ఈ కలబంద రస ప్రభావం వాళ్ళ దృష్టి కోల్పోవడం జరుగుతుంది… ఎక్కువుగా కలబంద రసం తీసుకోవడం వాళ్ళ ముత్ర పిండాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఉదర సంబంధిత సమస్యలతో బాధపడే వారు కలబంద రసానికి దూరంగా ఉండడం అత్యంత శ్రేయస్కరం..
క్రోన్స్ వ్యాధి మరియు అల్సరేటివ్ కొలిటిస్ వంటి ఈ ప్రేగు సంబంధిత వ్యాధులవంటి ఉన్నట్లయితే కలబంద రసానికి చాలా దూరంగా ఉండడం మంచిది.
ఇక కలబంద ఆకు యొక్క పైపొరలో పసుపు ఉండే పదార్ధాని లేటెక్స్ అంటారు.. దీనిని సేవించడం ప్రమాద కరం అంటున్నారు వైద్యులు. కలబంద లేటెక్స్ సేవించడం వలన మూత్రపిండాల సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి మరియు పొటాషియం స్థాయిలు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు కలుగుతాయి. మరి కొంత మందికి కలబంద లో ఉండే లేటెక్స్ వల్ల అలెర్జీ కలగవచ్చు.

దీర్ఘకాలం పాటు కలబంద గుజ్జును వాడటం వలన చర్మసంబంధిత అలెర్జీలు, వాపు, దద్దుర్లు మరియు కనురెప్పలలో ఎర్రదనం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. చర్మం పొడిబారడం, గట్టిపడటం, ఊదా మచ్చల ఏర్పడటం మరియు పగలడం వంటి అనేక ఇతర దుష్ప్రభావాలు కూడా ఏర్పడతాయి. అంతేకాకుండా, గుజ్జును రాసుకుని ఎండలోకి అడుగు పెట్టడం వలన చర్మం పై దద్దుర్లు మరియు దురద లేదా ఎరుపుదనం మరియు మంట కలగవచ్చు.
ఇక కలబంద రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది కనుక… అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు, కలబంద తీసుకునేటప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి.
గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు, కలబంద రసం, గుజ్జు, లేటెక్స్ లను తినడం మంచి కాదు.. గర్భాశయ సంకోచాలను ప్రేరేపించి, గర్భస్రావం వంటి సమస్యలకు కారణమవుతుంది. పుట్టబోయే పిల్లలలో లోపాలు తలెత్తే ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇక అధికంగా తీసుకుంటే కాలేయం పై తీవ్ర ప్రభావం చూపుతుంది.. మంట ఏర్పడుతుంది. కొన్ని సార్లు దీనిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కాలేయానికి హానిని కలిగిస్తాయి కూడా
కలబంద ను పెంచే సమయంలో సంరక్షించడానికి కొన్ని మందులను ఉపయోగిస్తారు. అవి మూత్రపిండ వ్యాధులకి దారి తీస్తాయి.

హెమరాయిడ్లు ఉన్నవారు కలబంద రసంను తీసుకుంటే వారి పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుంది. శస్త్రచికిత్స సమయంలో మరియు తరువాత కూడా, కలబంద రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవచ్చు మరియు రక్త చక్కెర నియంత్రణలో జోక్యం చేసుకోవచ్చు. ఇక ఎవరైనా శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లయితే, శస్త్రచికిత్సకు రెండు వారాల ముందుగానే కలబంద రసం తీసుకోకూడదు.

Comment here