గవర్నర్ కు తన పెళ్లి శుభలేఖను అందించిన అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ నేపధ్యంలో తన పెళ్లికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించారు. మంగళవారం రాజభవన్కు వచ్చిన అఖిలప్రియ.., గవర్నర్ నరసింహన్ ను కలసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అట్లానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా పెళ్లికి ఆహ్వానించారు. అయితే సీఎం అందుబాటులో లేకపోవడంతో ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ కు ఆహ్వానపత్రిక అందజేశారు. మంత్రి అఖిలప్రియతో పాటు ఆమె సోదరి నాగ మౌనికారెడ్డి, ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, గణేష్ రెడ్డి, ఇతర కుటుంబసభ్యులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here