త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న ఆర్ఎక్స్ 100 దర్శకుడు

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ ను తన వైపుకు తిప్పుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి.. అసిస్టెంట్ దర్శకుడు నుంచి దర్శకుడు గా మారి చేసిన ఒక్క సినిమాతోనే మంచి విజయం అందించుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం తన రెండో సినిమా పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ దర్శకుడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అజయ్ తాను ప్రేమిస్తున్న శిరీష అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నాడు. . ఇంజనీరింగ్ పూర్తి చేసిన శిరీష గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. ఈ నెల 25న వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో హైదరాబాద్ లోనే జరగనుంది. అయితే ఈ అజయ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు దూరపు బంధువుఅని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here