Local news

విమానంలో అగ్ని ప్రమాదం…. తప్పిన పెను ముప్పు

హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో 149 మంది ప్రయాణికులకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన జజీరా J9608 విమానం లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విమానం రన్‌ వేపై దిగుతున్న సందర్భంలో కుడి వైపున ఉన్న ఇంజన్‌ నుంచి మంటలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని వెంటనే నిలిపేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

Comment here