ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘానిస్థాన్

ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా మంగళవారం ఇండియా-ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఆఫ్ఘనిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ రోజు మ్యాచ్లో కెప్టెన్ మారారు. రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వడంతో అతని స్థానంలో టాస్ కి ధోని వచ్చాడు. విశేషమేమిటంటే ఎంఎస్ ధోనీకి కెప్టెన్ గా ఇది 200వ మ్యాచ్. ఆసియా కప్ పర్యటనకు వచ్చిన 15 మందికీ భారతజట్టులో స్థానం ఉండాలన్నదే తమ ఉద్దేశమని ధోనీ అన్నాడు.దీపక్ ఛాహర్ అరంగ్రేటం చేయనున్నాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, ఛాహల్ కు విశ్రాంతినిచ్చారు.

ఇండియా: లోకేష్ రాహుల్, అంబటి రాయుడు, మనీష్ పాండే, దినేష్ కార్తిక్, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, దీపక్ ఛాహర్, కుల్దీప్ యాదవ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here