సెమీఫైనల్ కు చేరిన సింధు

ప్రపంచ ఛాంపియన్ షిప్ లో సింధు క్వార్టర్ ఫైనల్ లో నజొమి ఒకుహరను ఓడించి సెమీఫైనల్ కి దూసుకెళ్లింది. గత సంవత్సరం ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకుంది.శుక్రవారంనాడు హోరాహోరీగా జరిగిన పోరులో సింధు 21-17, 21-19తో ఒకుహరను మట్టికరిపించింది. అయితే మిగతా భారత క్రీడాకారులు సైనా నెహ్వాల్, సాయి ప్రణీత్, అశ్విని పొన్నప్ప ఓడిపోయి ఇంటిదారి పట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here