Education and Employment

గుంటూరు ఏసీ కాలేజీలో కొత్తగా పీజీ కోర్సులు

గుంటూరులోని ఏసీ కాలేజీలో నూతనంగా పీజీ కోర్సులు ఎంకాం, ఎమ్మెసీ మేధమాటిక్స్ తరగతులను శుక్రవారం మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. మంత్రి ఆనందబాబు మాట్లాడుతూ గతంలో ఏ కాలేజీకి లేని ఫ్యాకల్టీ ఏసీ(ఆంధ్ర క్రిస్టియన్) కాలేజీ లో ఉండేవన్నారు. గతంలో ఏసీ కాలేజీ ఇండియాలో నెంబర్ వన్ గా ఉండేది. ఏసీ కాలేజీ పూర్వ విద్యార్థిగా, గత వైభవాన్ని ఏసీ కాలేజీకు తీసుకురావాల్సిన బాధ్యత నాపై ఉందన్నారు. తప్పకుండా ఏసీ కాలేజ్ కు నా వంతు సహకారమందిస్తానని మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు.

Comment here