నిత్య విద్యార్ది, మిసైల్ మ్యాన్ కలాం తృతీయ వర్ధంతి నేడు..

కలలు కనండి… నిజం చేసుకోండి అంటూ పిల్లలకు యువతకు నిచ్చిన మిసైల్ మ్యాన్ అబ్ధుల్ కలాం మన దేశ గొప్ప శాస్త్ర వేత్తల్లో ఒకరు. 1931, అక్టోబర్ 15 న తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో కలాం జన్మించారు. తల్లిదండ్రులు అషియమ్మ జైనుల్లాబ్దీన్, జైనుల్లాబ్దీన్ మరకయార్ లు. 1958 లో మద్రాస్ మద్రాస్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ ఎం) నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పట్టాను అందుకొన్నారు. మొదట (డి.ఆర్.డి.ఒ)లో అనంతరం 1962లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరారు. మిసైల్ మ్యాన్ గా కలాం ఎన్నో అవార్డులతో పాటు భారతరత్న సహా కలాం ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 40 విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి గౌరవించాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించిన కలాం.. ఆ బాధ్యతలనుంచి రిలీవ్ కాగానే… మళ్ళీ ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. పిల్లలను అమితంగా ప్రేమించే కలాం చివరి నిమిషం వరకూ పిల్లలతోనే గడిపారు. కలాం కళా ప్రేమికుడు. నిత్య స్వాప్నికుడు. మహా దేశభక్తుడు. నిత్య విద్యార్థి. నిరాడంబరంగానే ఉండేవాడు. మీరు ఎవరు అని అడిగితే.. ‘నేను శాస్త్రవేత్తను. ఉపాధ్యాయుడిని, విద్యార్థిని అని మొదట చెబుతారు. ఆ తర్వాతే రాష్ట్రపతిగా పని చేశానని చెబుతారు. హైదరాబాదులో రెండు అద్భుతమైన వైద్య ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి విజయవంతం చేశారు. అవి ఎందరే పేదల జీవితాల్లో వెలుగులు నింపాయి. ఖురాన్‌తో పాటు, భగవద్గీత‌ను చదివే కలాం మతఘర్షణలను నిరసించే శాంతికాముకుడు.. 2015 జూలై 26 సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో షిల్లాంగ్‌లోని ఐఐఎంలో ప్రసంగిస్తూ అకస్మాత్తుగా కలాం కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించేలోగానే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. చికిత్సనందిస్తున్న సమయంలోనే అంటే జూలై 27 న కలాం తన 84 ఏట మృతి చెందారు.. పేపర్ బాయ్ నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన కలాం జీవితం ఎందరికో స్పూర్తి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here