చైనాలో దంగల్ ను బీట్ చేసిన బాహుబలి

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాడి సత్తాను చాటి.. జెండాను ఎగర వేసిన సినిమా బాహుబలి సిరీస్… జక్కన్న రాజమౌళి చెక్కిన వెండి తెర శిల్పం బాహుబలి ది కన్ క్లూజన్ రిలీజై.. ఏడాదైనా ఇంకా రికార్డులు సృష్టిస్తూనే ఉన్నది. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1,700 కోట్లకు పైగా వసూలు చేసింది. విమర్శకుల ప్రశంసల తో పాటు… అవార్డులను సొంతం చేసుకుంది. ఇక చైనాలో కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ రిలీజైన తొలిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది.

తొలిరోజే 2.85 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.19 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. భారీ ఓపెనింగ్స్ వచ్చిన భారతీయ సినిమాల జాబితాలో బహుబలి 2 సినిమా మూడో ప్లేస్ లో నిలిచింది. అమీర్ ఖాన్ దంగల్ సినిమాను బీట్ చేసింది. ఐతే మొదటి ప్లేస్ లో అమీర్ మరో సినిమా సిక్రెట్ సూపర్ స్టార్ 6.74మిలియన్ డాలర్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ప్లేస్ లో హిందీ మీడియం ఉంది.. అయితే ఈ వీకెండ్ లో బాహుబలి 2 మరిన్ని కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉందని… అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here