2019 ఎన్నికల్లో టీడీపీని ఓడించి తీరాలి : రామ్ మాధవ్

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ ఓడించి తీరాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ సమావేశంలో తీర్మానం చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి, అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి ఎంతో ద్రోహం చేసిన అధికార టీడీపీ తెలుగు ద్రోహుల పార్టీగా రామ్ మాధవ్ అభివర్ణించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రజలకు వివరించి 2019 ఎన్నికల్లో టీడీపీ పార్టీని ఓడించి తీరాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.8.50 లక్షల కోట్ల రూపాయల విలువైన వనరులున్న రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించి ముందుకు తీసుకెళ్లాల్సిందిపోయి, అవినీతి అరాచక పాలన సాగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇస్తున్నా చంద్రబాబు నాయుడు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రామ్ మాధవ్ తీవ్రంగా విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here