Sports

ఇంగ్లాండ్ మొదటిరోజు స్కోర్ 285/9

ఐదు టెస్టుల సిరీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అలిస్టర్ కుక్(13) ను ఆశ్విన్ క్లీన్ బౌల్డ్ చేసాడు. ఈ దశలో మరో ఓపెనర్ జెన్నింగ్స్ కు జోరూట్ కలసి 72పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ దశలో షమీ జిన్నింగ్స్ ను క్లీన్ బౌల్డ్. చేసాడు.తర్వాత వచ్చిన డేవిడ్ మలన్(8) ని కూడా షమీ ఎల్బీడబ్ల్యూ గా ఔట్ చేసాడు.తర్వాత వచ్చిన జానీ బ్రిస్టోతో కలసి జోరూట్ 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి 80పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రనౌట్ అయ్యాడు. తర్వాత 10 పరుగుల తేడాతో జానీ బిస్ట్రో,(70), జొస్ బుట్లర్(0) ల వికెట్లు కోల్పోయింది.తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ ఇంగ్లండ్ జట్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 285 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. అశ్విన్ 4వికెట్లు, షమీ 2వికెట్లు, ఉమేష్1వికెట్,ఇషాంత్1 వికెట్ తీశారు.డే వన్ 88 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 285/9 తో మొదటి రోజు ఆట ముగిసింది.

Comment here