హైదరాబాద్ ఐఐటి విద్యార్థికి 1.2 కోట్ల వార్షిక వేతనం

వికారాబాద్ కు చెందిన కె.స్నేహారెడ్డి ఐఐటి హైదరాబాద్ లో ఇటీవలే బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది. చదువుతో పాటు భిన్న అంశాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది. గూగుల్ సంస్థలో కె.స్నేహారెడ్డి1.2 కోట్ల రూ. వార్షిక వేతనంతో ఉద్యోగాన్ని సాధించింది. గూగుల్ సంస్థ మెరికల్లాంటి యువత కోసం దేశవ్యాప్తంగా అన్వేషించి అత్యంత ప్రతిభావంతులైన ఐదుగురిని ఎంపిక చేసింది. వారిలో ఒకరు మన తెలుగమ్మాయి కె.స్నేహారెడ్డి. మనకు ఏ చిన్న సమాచారం కావాలన్నా గూగుల్లో వెతికేస్తుంటాం.అలాంటి సంస్థ తమ వద్ద పనిచేసేందుకు మెరికల్లాంటి యువత కోసం దేశవ్యాప్తంగా అన్వేషించింది. కృత్రిమ మేధ అంశంపై చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పనిచేయగల సత్తా ఉన్నవారిని గుర్తించేందుకు ప్రత్యేక ముఖాముఖిలు నిర్వహించింది. దీనిలో మరో నలుగురుతోపాటు కె.స్నేహారెడ్డి కూడా సెలెక్ట్ అయ్యింది. స్నేహారెడ్డి చిన్ననాటినుండే చదువుతో పాటు క్రీడలు, ఇతర కార్యకలాపాల్లో చురుగ్గా ఉండేదని తండ్రి సుధాకర్ రెడ్డి చెప్పారు. అమ్మాయిలను ప్రోత్సహిస్తే అన్నిరంగాల్లో అత్యున్నత శిఖరాలను అవలీలగా అధిరోహిస్తారని సుధాకర్ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here