Local news

సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశాం : మంత్రి కేటీఆర్

తాజ్ కృష్ణాలో శనివారం సిఐఐ సౌత్ రీజనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్లో పెద్దపీట వేసామన్నారు. రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 4వేల రూపాయల పెట్టుబడి అందించాం. వందరోజుల్లో భూ రికార్డుల ప్రక్షాళన చేశాం. తెలంగాణలో 58 లక్షల మంది రైతులు సాగు చేస్తున్నారు. భూముల రికార్డుల నిర్వహణలో పలు మార్పులు జరిగాయి. రైతుకోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. దేశంలో ఏ రాష్ట్రమూ రైతులకు 8 వేలు ఇవ్వట్లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు భీమా పధకం అమలు చేస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరిద్దరించాము. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నామని తెలిపారు. హరితహారం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతున్నామని పేర్కొన్నారు……KS

Comment here