DevotionalVideos

శ్రీ రామనవమి మనము ఎందుకు జరుపుకుంటాం తెలుసుకోండి

శ్రీ రామనవమి మనము ఎందుకు జరుపుకుంటాం తెలుసుకోండి

శ్రిరాముని శ్లోకం  “శ్రీరామ రామ రామేతి   రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం   రామనామ వరాననే” ఈ  నామం జపిస్తే విష్ణు సహస్రనామావళిని పఠించిన అంత  ఫలితం మనకు వస్తుంది అని సాక్షాత్తు ఆ  పరమ శివుడు  పార్వతీ దేవితో చెప్పినట్టు గ్రంధాలు చెబుతున్నాయి.. అలాంటి మన శ్రీరామడు సీతా లక్ష్మణ హనుమ లతో ఎన్నో ప్రదేశాల్లో కొలువయ్యాడు. అందుకే శ్రీ రామనవమి మనము ఎందుకు జరుపుకుంటాం తెలుసుకోండి. కనుక  శ్రీరామనవమి రోజున ప్రతి ఊరులోను రామలయాలో సీతారాముల కల్యాణం చేస్తారు..

శ్రీ రామనవమి రోజున అందుకే తమ ఇంట్లోని పెళ్లి అన్నట్టుగా  పూజా మందిరాలను అలంకరించి, కొత్త బట్టలు ధరించి ఆ సీతారాములను పూజిస్తూ ఆరాధిస్తారు. సీతారాములు దగ్గరలోని ఆలయాలకు వెళ్లి స్వామివారి కల్యాణోత్సవాన్ని చూస్తారు. సీతారాముల కల్యాణ జరిగిన అక్షింతలను తలపై చల్లుకుని సంతోషపడతారు. ఇలా  సీతారాముల కల్యాణం జరిపించడం వలన ఆ ప్రాంతంలో ఉన్న కరవు అనేది కూడా రాదు. సీతారాముల కళ్యాణం చూడటం వలన మనకు ఉన్న సమస్త పాపాలు నశించిపోతాయి.

Comment here