Uncategorized

వివేకా శరీరంపై గాయాలు ! పీఏ ఫిర్యాదుతో మృతిపై అనుమానాలు

వివేకా శరీరంపై గాయాలు

వైఎస్ఆర్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. వివేకా పీఏ కృష్ణారెడ్డి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున బాత్ రూంలో వివేకా మృతిచెందారు. అయితే ఆయన తలకు, చేతికి బలమైన గాయాలు అయినట్లుగా గుర్తించారు. రక్తపు మడుగులో పడి ఉన్న వివేకానందరెడ్డిని గుర్తించి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. గురువారం రోజుంతా మండుటెండలో తిరిగి వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించినట్లు తెలుస్తుంది. దీంతో రాత్రి ఇంటికి చేరుకునేసరికి కూడా చాలా ఆలస్యం జరిగింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో… అలసి అలాగే పడుకుండిపోయారు వివేకానందరెడ్డి. ఉదయం నిద్రనుంచి మెలుకువరాగానే ఆయనకు వాంతులు అవ్వడంతో బాత్‌రూంలోకి వెళ్లారు. అక్కడ వాంతులు చేసుకునే క్రమంలో పడిపోయి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.అయితే వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆయన పీఏ ఆరోపిస్తున్నారు. వివేకానందరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిర్వహించి నిజానిజాలు నిగ్గుతేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. 68 ఏళ్ల వైఎస్ వివేకా గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే అయన గుండెపోటుతో మరణించారని భావిస్తున్న ..శరీరంపై గాయాలు ఉండటం అనుమానాలు రేకెత్తిస్తుంది ..