విజయవాడలో మెగా హెల్త్ క్యాంప్ : రమేష్

విజయవాడ నగరంలో ప్రప్రథమంగా హోటల్సదరన్ గ్రాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 29న మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించనున్నట్లు హోటల్ జనరల్ మేనేజర్ పి.వి.కె రమేష్ చెప్పారు. గురువారం గాంధీనగర్ లోని సదరన్ గ్రాండ్ హోటల్లో విలేకరుల సమావేశంలో ఉచిత వైద్య శిబిరానికి సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. హెచ్. సీ. జీ కాన్సర్ హాస్పిటల్, గణేష్ గ్యాస్ట్రో, కిషోర్ డెంటల్ హాస్పిటల్, శంకర నేత్ర చికిత్సాలయ హాస్పిటల్ తో పాటు పలు హాస్పిటల్ కు చెందిన వైద్యులు వైద్య సేవలను అందిస్తారని రమేష్ వివరించారు. హోటల్ రంగంలో మొదటి సారిగా ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సదరన్ ట్రావెల్స్ అండ్ హోటల్స్ అధినేత ఆలపాటి వెంకటేశ్వరరావు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్నవారికి వైద్య సేవలతోపాటు ఉచితంగా మందులు, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తామని చెప్పారు. లక్కీ కూపన్ హెల్త్ కార్డు వారి సహకారంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలోడా.గణేష్, డా. కిషోర్, లక్కీ కూపన్స్ హెల్త్ కార్డు ప్రతినిధి పగడాల శ్వేత, శంకర నేత్ర చికిత్సాలయ ప్రతినిధి కోతిరత్నం, హెచ్.సీ. జీ రీజినల్ హెడ్ సెంథిల్, పంటల నగేష్ తదితరులు పాల్గొన్నారు…… KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here