CinemaLatest UpdatesReviews

రివ్యూ: భరత్ అనే నేను

రివ్యూ: భరత్ అనే నేను
నటీనటులు: మహేష్ బాబు, కైరా అద్వాని, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, రమాప్రభ, దేవరాజ్, ఆమని, సితార, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, బ్రహ్మాజీ తదితరులు
నిర్మాత: డివివి దానయ్య
బ్యానర్ : డీవీవీ ఎంటర్ టైన్మెంట్
ఫోటోగ్రఫి : రవి కె. చంద్రన్, తిరు
దర్శకుడు: కొరటాల శివ
విడుదల తేది: 20-04-2018

భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుక్కి ఎన్టీఅర్, మహేష్ లు కలిసి సందడి చేసి.. ఒక అందమైన ఫ్రేం ని అప్పుడే తెచ్చేశారు.. ఇక ఎన్టీఆర్ ఈ వేడుకలో మహేష్ అరుదైన రకం.. ఆయన్ని అలాగే ఉండనిద్దాం.. అని ఒక్క ముక్కలో మహేష్ వ్యక్తిత్వం గురించి తను ఎంచుకొనే సినిమాలను గురించి చెప్పేశాడు.. ఇక టాలీవుడ్ లో ఏ యంగ్ హీరో కూడా ఆయన చేసిన ప్రయోగాత్మక సినిమాలను చేయలేదు అంటే అతిశయోక్తి కాదు.. ఇక తాజాగా శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ హిట్ ఇచ్చిన కొరటాల శివ తో రాజకీయ నేపథ్యంతో భరత్ అనే నేను సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.సిఎంగా ఏ మేరకు అభిమానులను అలరించింది.. చూద్దామా..!!

కథ: భరత్ రామ్ (మహేష్ బాబు) ఆంధ్రప్రదేశ్ (విడిపోవడానికి ముందు) ముఖ్యమంత్రి (శరత్ బాబు) తనయుడు.. లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతుంటాడు. తండ్రి మరణించడంతో లండన్ ను ఎపీకి తిరిగి వస్తాడు.. పార్టీ నేతలు భరత్ ను సీఎం గా ఎన్నుకుంటారు.. తాను సిఎం గా ప్రమాణం చేసిన తర్వాత రాష్ట్ర పరిస్థితులను ఏ విధంగా చక్కదిద్దాడు.. అతనికి ఏ విధమైన అడ్డంకులు ఎదురయ్యాయి.. భారత్ కు వసుమతి (కైరా అదాని) తో ప్రేమ ఎలా మొదలైంది అనింటిని బ్యాలెన్స్ చెస్తూ.. భారత్ గమ్యం చేరుకున్నాడా… సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే..!

విశ్లేషణ: ఇది ఒక రాజకీయ నేపథ్య కథ.. మహేష్ ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకుని కొరటాల శివ కమర్షియల్ హంగులను కలిపి సన్నివేశాలు రాసుకున్నాడు.ముఖ్యంగా భరత్ సిఎం అయ్యాక సినిమాలో వేగం పెరుగుతుంది. ఊక దంపుడు ఉపన్యాసం లేకుండా మాస తో పాటు అన్ని వర్గాలు మెచ్చే విధంగా చిత్రాన్ని తీర్చి దిద్దాడు దర్శకుడు. సీఎం గా భరత్ తీసుకొనే నిర్ణయాలు షాక్ ఇస్తే.. అసెంబ్లీ లో అడుగు పెట్టిన సన్నివేశం నవ్వులు పూయిస్తుంది.. ఇక వసుమతితో ప్రేమ కథ.. ఆహ్లాదం ఇస్తుంది.. భరత్ అనే నేను పాట బ్యాక్ గ్రౌండ్ లో హీరోయిజం ఎలివేట్ చేయడం కోసం వాడుకోవడం బాగుంది. కానీ విశ్రాంతి దగ్గర పెద్దా ట్విస్ట్ లు ఏమీ లేవు..

ఇక సెకండాఫ్ మాస్ కు నచ్చుతుంది. పాటలు, ఫైట్స్, మాస్ ఎలిమెంట్స్ రాజకీయం, అన్నింటితో చాలా ఆకట్టుకుంటుంది. ప్రెస్ మీట్ లో దర్శకుడు తాను చెప్పాలను కున్న భావాలను సినిమా యొక్క ఆత్మను చెప్పే ప్రయత్నం చేశాడు. మీడియాను సైతం కార్నర్ చెస్తూ రాసుకున్న డైలాగ్స్ ఆలోచింప జేసేవిగా ఉన్నాయి. అయితే పతాక సన్నివేశాలకు ముందు భరత్ జోరు తగ్గినా.. మొత్తంగా భరత్ అనే నేను పక్కా వాణిజ్యంశాలతో కలిసి చక్కని రాజకీయ చిత్రంగా నిలిచిపోతుంది అని చెప్పవచ్చు..

ప్లస్ పాయింట్స్: మహేష్ బాబు పాత్ర.. నటన.. స్టైలింగ్ లుక్స్, కథాంశం, వాణిజ్య విలువలు, యాక్షన్ ఎపిసోడ్.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం

మైనస్ పాయింట్స్: క్లైమాక్స్ లో తగ్గిన వేగం..

చివరిగా భరత్ అనే నేను.. మహేష్ కు మరో శ్రీమంతుడు..

 

Comment here