రాముని నైవేద్యం… పానకం, వడపప్పు వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసా

రాముని నైవేద్యం... పానకం, వడపప్పు వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసా
శ్రీరామనవమి నైవేద్యం చేసే మేలు

చైత్రంలో వసంత ఋతువును అహ్వానిస్తూ.. ఉగాది పండగ.. తర్వాత తొమ్మిది రోజులకు శ్రీరామనవమి పర్వదినం వస్తుంది. ఈ రోజున జరిపే సితారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం అని పండితులు ఉవాచ. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పండగను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీరామ నవమి అంటే వెంటనే గుర్తుకు వచ్చేది.. ప్రసాదంగా ఇచ్చే పానకం, వడపప్పు.. మరి రాముని నైవేద్యం… పానకం, వడపప్పు వల్ల కలిగే మేలు ఏమిటో తెలుసా..!!

శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది పానకం. బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది వడపప్పున. ఈ రెండుటిని శ్రీరామునికి నైవేద్యంగా పెట్టి అనంతరం భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు. .శ్రీరామనవమి ఎండకాలం ఆరంభంలో వస్తుంది కాబట్టి ఈ రోజు పానకం, వడపప్పు తీసుకోవడం వల్ల కొన్ని వ్యాధులకు ఇవి ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. మిరియాలు, యాలుకలు మరియు బెల్లంతో చేసిన పానకం తాగడం వలన వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని కల్గిస్తుంది.. పెసరపప్పుతో చేసిన వడపప్పు తినడం వలన వడదెబ్బ తగలకుండా వేడి నుంచి కాపాడుతుంది. ఎండాకాలంలో పెసరపప్పు తినడం వల్ల శరీరంలోని వేడి కంట్రోల్‌లో ఉంటుంది..ఇంకా జీర్ణశక్తిని అభివ‌ృద్ధి పరుస్తుంది. అందుకే శ్రీరామనవమి రోజు ప్రసాదంగా తీసుకొనే పానకం, వడపప్పుని జ్ఞానానికి ప్రతీకగా పెద్దలు బావిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here