మాల్యా వద్దనున్న టిప్పు సుల్తాన్ ఖడ్గం మాయం..!!

మన బ్యాంకుల అప్పులను ఎగ్గొట్టి.. విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ మాల్య మళ్ళీ వార్తల్లో నిలిచాడు. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ కు చెందిన ఖడ్గాన్ని ఆయన 2004లో జరిగిన వేలంలో రూ.1.5 కోట్లకు దక్కించుకున్నాడు.. ఇప్పుడు ఆ ఖడ్గం కనిపించడం లేదు.. తమ ఫ్యామిలీకి ఆ ఖడ్గం దురదృష్టం తెచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఆ ఖడ్గాన్ని 2016లో ఎవరికో ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మల్యాపై  13బ్యాంకులు వేసిన కేసు విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆ బ్యాంక్ ల తరపున లండన్ లో వాదిస్తున్న లాయర్ ఈ విషయం పై కోర్టు లో తన వాదనని వినిపించాడు. మాల్య తన ఆస్తులను మాయం చేస్తున్నాడు అనడానికి నిదర్శనం.. టిప్పు సుల్తాన్ ఖడ్గం.. ఆ ఖడ్గం విలువ ఇప్పుడు రూ.1.8కోట్లు ఉంటుంది.. అని చెప్పారు.. అయితే 9 వేల కోట్ల మేరకు బ్యాంకుల ఋణం ఎగ్గొట్టి.. లండన్ పారిపోయిన మాల్యా అంతర్జాతీయ అస్తులన్నింటిని ప్రస్తుతం ప్రీజ్ చేశారు.. ఈ ప్రీజ్ ఇలాగే ఉండాలని బ్యాంక్ లు కోర్టుని కోరుతున్నాయి.. ఆయన తరపు లాయర్.. ఇది సరికాదు అని వాదిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here