మహిళ హాకీ ప్రపంచ కప్ లో భారత్ ఓటమి

మహిళల హాకీ ప్రపంచకప్ లో భాగంగా గురువారం ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత హాకీ జట్టు పరాజయం పాలైంది. ఈ టోర్నమెంట్ లో అతిధ్య ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ ను భారత్ డ్రాగా ముగించుకుంది.దీంతో ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ మ్యాచ్ లో ఇరుజట్లూ ఆరంభం నుండీ హోరాహోరీగా తలపడ్డాయి. అయితే 13వ నిమిషం వద్ద ఐర్లాండ్ క్రీడాకారిణి అన్నా ఓఫ్లాంనగాన్ పెనాల్టీ కార్నర్ ని గోల్ గా మలచి ఐర్లాండ్ ఖాతా తెరిచింది. ఆతర్వాత వెంటనే భారత్ కు పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చినా గోల్ సాధించ లేకపోయారు. దీంతో హాఫ్ టైం ముగిసే సరికి ఐర్లాండ్ 1-0 తేడాతో ఆధిక్యం సాధించింది. సెకండ్ హాఫ్ లో కూడా భారత్ కు మరోసారి పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చింది. కానీ దీనిని కూడా భారత్ చేజార్చుకుంది. ఆ తరువాత ఇరు జట్లు గోల్స్ సాధించలేకపోయాయి. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి ఐర్లాండ్ 1-0 తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించింది……KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here