బిజేపీనే యూటర్న్ తీసుకుంది : చంద్రబాబు

ఈరోజు టిడిపి ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎం చంద్రబాబు.. పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. ఏపీ విషయంలో యూ టర్న్ తీసుకుంది.. బిజేపీ ఏ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఎపీకి ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం, ఇచ్చిన రూ.350 కోట్లను వెనక్కి తీసుకోవడం.. హోదా 15 ఏళ్ళు ఇస్తామని చెప్పి.. ఇవ్వక పోవడం… ఇవన్ని యూ టర్న్ అని సిఎం చంద్రబాబు ప్రశ్నించారు.
అంతేకాదు.. మిగిలిన రాష్ట్రాలను ఒకలా.. ఎపీని ఒకలా చూస్తున్నారని.. అందుకు ఉదాహరణ రాజస్థాన్ పెట్రో కాంప్లెక్స్‌కు వీజీఎఫ్ సగం తగ్గించారు… అదే సమయంలో కాకినాడ పెట్రో కాంప్లెక్స్‌కు రూ.5,361 కోట్లు ఏపీనే కట్టమనడం … డిల్లి, ముంబై కారిడార్ కు ఒక న్యాయం.. విశాఖ చెన్నై కారిడార్ కు ఒక న్యాయం.. ధోలేరా నగర నిర్మాణానికి నిధులు పుష్కలం… మరి అమరావతికి మాత్రం నిధులు మంజూరు చెయ్యడానికి అనేక సాకులు చెబుతున్నారు… అని చంద్రబాబు బీజేపీని నిలదీశారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here