Local news

బాలయ్య వ్యాఖ్యలఫై గవర్నర్ కు ఫిర్యాదు అంటోన్న బిజేపీ నేతలు

బాలయ్య వ్యాఖ్యలఫై గవర్నర్ కు ఫిర్యాదు

సీఎం చంద్రబాబు ఏపీ ప్రత్యేక హోదా కోసం చేపట్టిన దీక్ష పై బీజేపీ నాయకులు విమర్శలు గుప్పించారు. ప్రజల సానుభూతి పొందడానికి బాబు దీక్షను చేశారు అని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక చంద్ర బాబు దీక్ష సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలను తీవ్రంగా బిజేపీ నేతలు ఖండించారు… దీక్ష పేరుతో ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని కోట్లాది రూపాయలు వృధా చేశారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ వ్యాఖ్యానించారు. బాలయ్య మాట్లాడిన మాటలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని.. లేదంటే తాము ఆయనపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు.. తన దీక్షతో కేంద్రం దిగి వస్తుందని చంద్రబాబు అంటుంటే.. విపక్షాలు మాత్రం ఇదో రాజకీయం అంటూ విమర్శలు చేస్తున్నారు.

Comment here