ఫేస్ బుక్ ని డిలిట్ చేసే సమయం వచ్చేసింది : యాక్టన్

ఫేస్ బుక్ ని డిలిట్ చేసే సమయం వచ్చేసింది : యాక్టన్
బ్రియాన్ యాక్టన్ ఫేస్ బూక్ పై స్పందన
ఫేస్ బుక్ ని డిలిట్ చేసే సమయం వచ్చేసింది : యాక్టన్ 

ఫేస్ బుక్ సీఈవో జుకేర్ బర్గ్ పై వాట్సాప్ కో ఫౌండర్ బ్రియాన్ యాక్టన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం హల్ చల్ చేస్తోంది. యూజర్ల డేటాను వాళ్ల అనుమతి లేకుండా పొలిటికల్ డేటా అనాలిసిస్ కంపెనీ కేమ్‌బ్రిడ్జ్ అనలిటికా వాడుకుందన్న ఆరోపణలు వస్తున్న సంగతి విదితమే.. ఈ విషయం పై యాక్టన్ స్పందిస్తూ ఫేస్ బుక్ ని డిలిట్ చేసే సమయం వచ్చేసింది అన్సి ట్విట్ చేశారు. కాగా ఈ కేసు విషయం పై ఇప్పటికే జుకెర్ బర్గ్ కు నోటీసులు కూడా అందాయి. దీంతో షేర్లు భారీగా పతనం అయ్యి.. వేల కోట్లు నష్టపోయారు. అయితే 2014లోనే 1900 కోట్ల డాలర్లు పెట్టి వాట్సప్ ను కొనుగోలు చేసింది. అప్పటి నుంచి వాట్సాప్ కో ఫౌండర్ అయిన బ్రియాన్ యాక్టన్ ఫేస్ బుక్ లోనే నాలుగేళ్ల పాటు కొనసాగారు. ఇటీవలే అయన సిగ్నల్ పౌండేషన్ అనే కంపెనీకి మారారు. దీంతో యాక్టన్ చేసిన ప్రస్తుత ట్విట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా డేటా చోరీ ని ఫేస్ బుక్ సీరియస్ తీసుకొని విచారణ మొదలు పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here