తొలకరి వానకే వణుకుతున్న హైదరాబాదు…

నైరుతి రుతు పవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. తొలకరి వానకే హైదరాబాద్ వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్డుపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బల్దియా అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపం మారింది. వరద నీటిలో రోడ్లు గుంతలమయంగా మారాయి. నాలాలు ప్రమాదకరంగా మారాయి. బురదగా మారిన రోడ్డుపై ప్రయాణించడం వాహనదారులకు నరకంగా మారింది. పలుచోట్ల నాలాలు పొంగడంతో నీరంతా కాలనీలను ముంచెత్తింది. డ్రైనేజీ నీళ్లు ఇళ్లలోకి రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here