చిన్నమ్మ పై కొడుకు వరసయ్యే యువకుడు అత్యాచారం

చిన్నమ్మ పై కొడుకు వరసయ్యే యువకుడు అత్యాచారం
యువకుడి అత్యాచారం

వయసుని..వావి వరసని మరచి కొందరు కామంధులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని రాజా నాయక్ తండాలో చిన్నమ్మ పై కొడుకు వరసయ్యే యువకుడు అంటే తల్లి తర్వాత తల్లి అయిన చిన్నమ్మ పై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు.. బలవంతంగా నోట్లో చీరను కుక్కి… తాళ్ళతో బంధించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలు కుటుంబ సభ్యులకు చెప్పగా.. వారు కొడుకులాంటి వ్యక్తి ఫై నిందలు వేస్తావా… అని తిరిగి ఆమె దాడికి పాల్పడ్డారు.. బాధితురాలు తీవ్ర గాయాలతో ప్రస్తుతం సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. వివరాల్లోకి వెళ్తే..

బాధితురాలి భర్త ఏడాది క్రితం మరణించడంతో కూలి పనులు చేసుకుంటూ తన ముగ్గురు పిల్లల్ని పెంచుకుంటుంది. ఆమె ఇంటికి దగ్గరగా భర్త తరపు పెదనాన్న కుటుంబం నివసిస్తుంది. బాధితురాలిపై వరసకు కుమారుడైన శ్రీకాంత్ కన్నేశాడు.. అదను చూసి ఆదివారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో బాధితురాలి నోటిలో చీర కుక్కి… తీవ్రంగా కొట్టాడు.. సృహ తప్పగానే.. అత్యాచారయత్నం చేశాడు.. ఆమెకు మెలకువ రాగా నీకు తల్లివంటి దానిని ఇది తప్పు అని ప్రాధేయ పడడంతో నోరు నొక్కి.. తాళ్ళతో బంధించి అత్యాచారం చేశాడు.. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా ఆమెపై దాడి చేయడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here