Uncategorized

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ దే! రేవంత్ పక్కా వ్యూహం ఇదే

ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఓటమి చవిచూసిన కాంగ్రెస్ ..ఖమ్మంలో మాత్రం సత్తా చాటింది . లోక్ సభ ఎన్నికల్లోనూ ఇక్కడ పట్టు నిలుపుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుంది ..అందులో భాగంగా ..తెలంగాణ టీడీపీ సీనియర్ నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ని కాంగ్రెస్ లో చేర్చుకొని ఖమ్మ బరిలో నిలుపుతుంది . గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున మహాకూటమి అభ్యర్థిగా ఖమ్మం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన నామా నాగేశ్వరరావు… టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ చేతిలో ఓటమి పాలయ్యారు. త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… ఆయన టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. టీడీపీ తరపున 2009లో ఖమ్మం ఎంపీగా విజయం సాధించిన నామా నాగేశ్వరరావు… 2014లో వైసీపీ ఎంపీగా పోటీ చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీ చేయాలని భావిస్తున్న నామా… టీడీపీ తరపున పోటీ చేయడం వల్ల ప్రయోజనం ఉండదనే అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. గురవారం అమరావతిలో జరిగిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశానికి నామా నాగేశ్వరరావు డుమ్మా కొట్టడంతో.. కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిక దాదాపు ఖాయమే అనే ప్రచారం జరుగుతోంది. తమ పార్టీలో చేరితే ఖమ్మం ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ నుంచి సంకేతాలు రావడం వల్లే…ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , గతంలో నామా సహచరుడైన రేవంత్ కూడా నామతో మంతనాలు జరిపినట్టు తెలుస్తుంది .. ఈ నేపథ్యంలో నామా కాంగ్రెస్ నుంచి ఖమ్మం బరిలో దిగడం ఖాయమని తెలుస్తుంది ..