Latest Updates

కొడాలి పై అవినాష్ విజయం సాధించగలడా ! గుడివాడ సర్వే

కొడాలి పై అవినాష్ విజయం సాధించగలడా ! గుడివాడ సర్వే
వైసీపీలోని ముఖ్యనేతలను ఓడించేందుకు గత కొంతకాలంగా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తుంది టీడీపీ. ఇటువంటి వారి జాబితాలో గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఉన్నారు. రెండుసార్లు టీడీపీ తరపున గెలిచిన కొడాలి నాని… చంద్రబాబును తీవ్రంగా విమర్శించి వైసీపీలో చేరారు. వైసీపీ తరపున గుడివాడలో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపొందిన నాని… గడిచిన ఐదేళ్లలోనూ టీడీపీకి వ్యతిరేకంగా గట్టిగా పోరాడారు. అసెంబ్లీ లోనూ టీడీపీని విమర్శించడంలో తనవంతు పాత్ర పోషించారు. దీంతో రాబోయే ఎన్నికల్లో గుడివాడలో కొడాలి నానిని ఓడించి మళ్లీ ఆయనను అసెంబ్లీకి రానీయకుండా చేయాలని పట్టుదలగా ఉన్న చంద్రబాబు… ఆయనకు పోటీగా ఏరికోరి దేవినేని అవినాష్‌ను రంగంలోకి దింపుతున్నారు. మాజీమంత్రి దేవినేని నెహ్రూ తనయుడైన దేవినేని అవినాష్… ప్రస్తుతం తెలుగు యువత అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించిన అవినాష్… గుడివాడలో కొడాలి నానిని రాజకీయంగా ఢీ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గుడివాడకు నాన్ లోకల్ అయిన దేవినేని అవివాష్… కొడాలి నాని ఓడించడం సాధ్యమవుతుందా అనే చర్చ జిల్లా రాజకీయవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. దేవినేని అవినాష్‌ను బరిలోకి దింపేందుకు వీలుగా అక్కడ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరరావుకు ఎమ్మెల్సీ పదవి, యలపర్తి శ్రీనివాసరావుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని చంద్రబాబు ఆఫర్ చేశారు .దీనితో దేవినేని కి లైన్ క్లియర్ అయింది .అయితే దేవినేని అవినాష్ ..నాని ని ఓడించగలడా అనేది సర్వత్రా ఆసక్తి రేపుతోంది . గుడివాడ మొదటి నుంచి కూడా టీడీపీకి కంచుకోటగా ఉంది .. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహించడంతో.. ఆ ప్రభావం ఇప్పటికి ఉంది .1978 నుంచి ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఇక్కడ ఎన్నిక జరగ్గా ..ఆరుసార్లు టీడీపీ గెలిచిందంటే ఆ పార్టీ హవా ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు .. ప్రస్తుతం వైసీపీ తరపున ఇక్కడ నుంచి కొడాలి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు ..కొడాలి మొదట 2004 లో టీడీపీ తరపునే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .ఆ తర్వాత 2009 లోను అదే పార్టీ తరపున నిలిచి గెలిచారు ..అయితే ఆ తర్వాత టీడీపీ అధిష్టానంతో విభేదించి వైసీపీలో చేరారు ..ఆ పార్టీ తరపున 2014 లో పోటీచేసి విజయం సాధించి టీడీపీ కంచుకోటకు గండి కొట్టాడు ..దీనితో కొడాలి పై టీడీపీ అధినేత ప్రత్యేక ద్రుష్టి పెట్టి ఓడించే ప్రయత్నం చేస్తున్నారు . అయితే కొడాలి నాని ఇక్కడ వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించారు .మరోసారి విజయం సాధించడానికి సిద్ధమవుతున్నారు ..గెలుపు ఖాయమన్న ధీమాలో అయన ఉన్నారు . నియోజకవర్గంలో బలంగా ఉన్న కొడాలి నానిని ఓడించాలంటే ..మాజీ ఎమ్మెల్యే రావికి కష్టమే అన్న వ్యాఖ్యలు రావడంతో దేవినేని తెరపైకి వచ్చారు .. నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఎవరికీ అండగా ఉంటుందనేది ఆసక్తికరమే .. నాని ,అవినాష్ ఇద్దరు ఒకే సామజిక వర్గానికి చెందినవారు ..అయితే కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఇద్దరికి పడటం.. మిగిలిన సామజిక వర్గాల్లో వైసీపీకి ఆదరణ ఉండటం గత ఎన్నికల్లో నానికి ప్లస్ అయిందని ఈ సారి కూడా అలానే జరుగుతుందని వైసీపీ భావిస్తుంది . టీడీపీ తరపున రెండు సార్లు గెలిచిన కొడాలి ..తమ కంచుకోటను బద్దలుకొట్టి వైసీపీనుంచి గెలవడంపై జిల్లా టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు .. నానిని ఎలాగైనా ఓడించాలని భావిస్తున్నారు .. జిల్లా అంతటా పట్టు ఉన్న దేవినేని వారసుడు అయితేనే నానికి పోటీ ఇవ్వగలరని ..ఏరి కోరి అవినాష్ ని తీసుకొని వచ్చారు .కానీ , నాని ఇక్కడ నుంచి వరుసగా మూడు సార్లు గెలవడంతో తనకంటూ బలమైన అనుచరులను ఏర్పాటు చేసుకున్నారు , అలాగే కొంత వరకు పనులు కూడా చేశారు .. ఆయనకు బలంగా మారాయి. అయితే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చలేదని .. చాలావరకు పనులు అలాగే పెండింగ్ లో ఉన్నాయన్న విమర్స .మైనస్ గా మారవచ్చు . ఇక దేవినేని అవినాష్ పూర్తిగా టీడీపీ క్యాడర్ పైనే ఆధారపడుతున్నారు ..గుడివాడ సెగ్మెంట్ లో గుడ్లవల్లేరు , గుడివాడ , నందివాడ మండలాలు ఉన్నాయి ..ఇక్కడ కమ్మ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ..అలాగే బిసి ,ఎస్సిల ఓటర్లతో పాటు కాపు సామాజికవర్గం కూడా ఇక్కడ ప్రభావం చూపుతుంది .. కమ్మ వర్గం టీడీపీకి సానుకూలంగా ఉన్నా.. ఎమ్మెల్యేగా నానికే ఓటేస్తున్నారు ..అయన టీడీపీలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఓటు బ్యాంక్ ను తన ఓటు బ్యాంక్ గా మలచుకున్నాడు .అదే ప్రధాన బలం ..ఇక కాపు ఓట్ల కోసం ఇటీవల రాధతో కూడా సమావేశమై ఆ వర్గం ఓట్లను కూడా చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ..ఇక దేవినేని కుటుంబానికి జిల్లాలో పట్టున్నా.. గుడివాడలో పోటీ చేయడం ఇదే తొలిసారి ..ఈ నేపథ్యంలో అవినాష్ నానికి ఏ మేరకు పోటుకి ఇస్తారు అనేది ఆలోచించదగ్గ విషయమే ..అయితే టీడీపీ కార్యకత్తల బలంపైనే అవినాష్ అసలు పెట్టుకున్నారు ..ఇక టీడీపీ చేస్తున్న సంక్షేమ పధకాలు కలసి వస్తాయని నమ్ముతున్న

 
ారు ..అయితే బూత్ స్థాయిలో బలంగా ఉన్నా నానిని ఢీ కొట్టడం అవినాష్ కి కష్టమే అని చెప్పాలి .. మరి టీడీపీ ఓటు బ్యాంక్ బలంగా ఉన్నా నేపథ్యంలో .. నాని -అవినాష్ మధ్య గట్టి పోటీ జరగడం మాత్రం ఖాయం ..అయితే కొడాలి కోటాలో దేవినేని పాగా వేయగలడా అంటే మాత్రం ఇప్పుడే చెప్పడం అసాధ్యం .