కాశి నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు కు కరెంట్ షాక్.. ఒకరు మృతి

దేవుడి దర్శనం కోసం వెళ్లి.. తిరిగి వస్తూ.. దేవుడిని దర్శించుకోవాలనుకున్న భక్తుల బస్సుకు కరెంట్ షాక్ తగిలింది. ఈ విషాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటనా తూర్పుగోదావరి జిల్లాలో తుని మండలం లోవ కొత్తూరు వద్ద జరిగింది.
భీమవరం నుంచి కాశీ యాత్రకు వెళ్లిన వాళ్లంతా తిరిగి వస్తూ తలుపులమ్మ అమ్మవారి దర్శనం చేసుకోవాలనున్నారు. మరికాసేపట్లో గుడికి చేరతామనగా బస్సుకు విద్యుత్ వైరు తలగడంతో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

శ్రీకాకుళానికి చెందిన 25మంది, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 20 మంది కాశీ యాత్రకు వెళ్లారు. అంతా కలిసి సంతోషంగా యాత్ర ముగించుకున్నారు. శ్రీకాకుళం వాళ్లు దిగేశాక.. మిగతా వాళ్లతో తలుపులమ్మ లోవకు బయలు దేరింది బస్సు. దారిలో ప్రమాదవశాత్తూ కరెంట్ వైర్ తగలడంతో ఒకరు చనిపోయారు. ప్రమాదం జరిగినతీరు చూస్తే మిగతా వాళ్లంతా ప్రాణాలతో బయటపడడం చాలా లక్కీ అనే చెప్పాలి అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here