కరుణానిధి పరిస్తితి ఆందోళన కరం… కాసేపట్లో వైద్యులు కీలక ప్రకటన

డిఎంకే అధినేత.. మాజీ సిఎం కరుణానిధి ఆరోగ్యం విషమంగా మారడంతో చెన్నై లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. డిఎంకే కార్యకర్తలు, అభిమానులు కావేరి ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. కాసేపట్లో వైద్యులు కీలక ప్రకటన చేయనున్నారు… కార్యకర్తలను పోలీసులు అదుపు చేయలేక పోతున్నారు. కరుణానిధి భార్య, కూతుర్లు, కుమారులు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు ఇప్పుడిప్పుడే కావేరి ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. దీంతో తమిళనాడు రాష్ట్రం అంతా అధికారులు అలెర్ట్ ప్రకటించారు. కావేరి ఆస్పత్రి నుంచి కరుణా నిధి ఇంటి వరకూ భారీగా పోలీసులు మొహరించారు. సిఎం పళని స్వామి తన కార్యక్రమాలను రద్దు చేసుకుని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. సన్ టీవీ, కళైంజర్ టీవీ సిబ్బందికి వారం రోజుల పాటు సెలవులను రద్దు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here