National

కరుణానిధి కన్నుమూత

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి (94) కన్నుమూశారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించినట్లుగా కావేరీ ఆసుపత్రి మంగళవారం సాయంత్రం తాజా హెల్త్ బులెటన్ ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు పేర్కొన్నారు. కొన్ని గంటలుగా అవయవాలు చికిత్సకు సహకరించడంలేదని తెలిపారు. వృద్ధ్యాప్యం కారణంగా ఆయన శరీరంలోని అంతర్గత అవయవాలు చికిత్సకు స్పందించే స్థితిలో లేనట్లు వైద్యులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు తుది శ్వాస విడిచినట్లు కావేరీ డాక్టర్లు ప్రకటించారు.మరోవైపు తమిళనాడు డిజిపి రాష్ట్రమంతా హైఅలెర్ట్ ప్రకటించారు. జిల్లాల్లో ఉన్న పోలీసు అధికారులు అంతా చెన్నై కి రావాలని, సెలవుల్లో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని డీజీపీ ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న తమ ఎంపీలు, నాయకులను వెంటనే చెన్నైకి రావలసిందిగా డీఎంకే పార్టీ కార్యాలయం ఆదేశించింది. తమిళనాడు అంతా శోకసంద్రంలో మునిగింది. కరుణానిధి 1924 జూన్ 3నతంజావూరులోని తిరుక్కువలైలో జన్మించారు. అసలుపేరు దక్షిణామూర్తి. ఆయన పూర్వీకులు తెలుగువాళ్లు. ఆయనకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు.

Comment here