ఐదుగురిని కనండి :. బీజేపీఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతి హిందు జంట …, ఐదుగురి పిల్లల్ని కనాలని అన్నారు. హిందూత్వాన్ని రక్షించుకోవాలంటే అలా చేయక తప్పదన్నారు. ఉత్తరప్రదేశ్ లోని బాలియా నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ గతంలోనూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని కాపాడుకోవాలంటే హిందువులు జనాభాను పెంచాలన్నారు.ప్రతి ఒక్క హిందువు జంటా ఐదుగురిని కనాలని ప్రతిఒక్క ఆధ్యాత్మిక గురువు భావిస్తుంటారని, ఈ రకంగానైనా జనాభాతో హిందూ ధర్మాన్ని రక్షించుకోవచ్చు అని అన్నారు. పెరుగుతున్న అత్యాచారాలను రాముడు కూడా నియంత్రించలేరని ఇటీవల సురేంద్ర సింగ్ కామెంట్ చేశారు. అత్యాచారం సహజ కాలుష్యమని, ప్రతి ఒక్కరినీ తమకుటుంభంగా, సోదరిగా భావించాలని, విలువల ద్వారానే అత్యాచారాలను నియంత్రించవచ్చని రాజ్యాంగం ద్వారా కాదు అని ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అన్నారు…….KS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here