ఆరునెలల చిన్నారిపై అత్యాచారం.. హత్య

ఆరునెలల చిన్నారిపై అత్యాచారం
చిన్నారి దారుణమైన హత్యా

మనవ మృగం కామ దాహానికి నెలల చిన్నారుల నుంచి చావుకు దగ్గరగా ఉన్న వృద్ధురాలి వరకూ బలైపోతున్నారు..వావి వరసలు మరచి జంతువుల్లా మారిపోతున్న ‘మృ’గాడి.. చేతిలో తల్లి పక్కన నిద్రిస్తున్న ఆరు నెలల చిన్నారి జీవితం అంతమై పోయింది. చిన్నారి పై లైంగిక దాడి చేసిన దుండగుడు.. అనంతరం ఆ చిన్నారిని చంపేశాడు.. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే..

ఇండోర్ నగరంలోని రాజ్ వాడా ఫోర్ట్ సమీపంలో దంపతులు బుడగలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు.. వీరికి 6నెలల చిన్నారి ఉన్నది.. గురువారం రాత్రి ఫోర్ట్ ముందు దంపతులు తమ చిన్నారి కూతురుతో పాటు కలిసి నిద్రిస్తున్న సమయంలో సునీల్ భీల్ అనే వ్యక్తి… చిన్నారిని ఎత్తుకొని వెళ్ళాడు.. సమీపంలో గల భవనం బేస్ మెంట్ లోకి తీసుకొని వెళ్లి.. చిన్నారిపై లైంగిక దాడి చేసి.. అనంతరం హత్య చేశాడు.. శుక్రవారం.. మధ్యాహ్నం బేస్ మెంట్ లోని దుకాణం తెరవడానికి వచ్చిన ఓ వ్యక్తి..రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారిని చూసి పోలీసులకు తెలియజేశాడు.. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సిసిటీవీ పుటేజ్ ను పరిశీలించగా.. శుక్రవారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి.. సదరు చిన్నారిని భుజాన ఎత్తుకొని బేస్ మెంట్ కు తీసుకొచ్చినట్లు తెలిసింది. పోక్సో చట్టం కింది నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.. ఇంకా దేశ ప్రజల మనసుల నుంచి కథువా, ఉన్నావ్ ఘటనలు చేరగాక ముందే.. మళ్ళీ మైనర్లపై నేరాల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.. కాగా ఇక నుంచి మైనర్లపై అత్యాచారం చేసిన నిందితులకు ఉరి అనే చట్టం ను కేంద్రం తీసుకుని రానున్న సంగతి తెలిసిందే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here